వెండి వెన్నెల
Saturday, December 11, 2010
మనసు, బుద్ధి ఈ రెండూ ఒకటేనా ? వేరువేరా?
మనం నిరంతరం చాలా ఊహలలో,ఆలోచనలలో మునిగితేలుతూ ఉంటాం. ఆ ఆలోచనలకు ఆది ఎక్కడ? మన మెదడులోనా? మరి అది మనసు చేసే పని కదా? ఇంతకీ దీనికి మూలం మనసా? మెదడా? గుండెకు పర్యాయ పదంగా మనం మనసును వాడుతున్నాం. అలాగే మెదడుకు పర్యాయంగా బుద్ధి అని వాడుతున్నాం. మనసు , బుద్ధి అనేవి కనపడవు. గుండె, మెదడు కంటికి కనిపిస్తాయి. అయితే ఈ మనసు, బుద్ధి రెండూ చేసేవి ఒకటేనా? లేక వేరు వేరు పనులు చేస్తాయా? ఇంతకీ మనసు, బుద్ధి ఈ రెండూ ఒకటేనా ? వేరువేరా? ఈ విషయాలలో నేను చాలా తికమక పడుతూ ఉంటాను. ఎవరైనా కాస్త వివరించగలరా?
Friday, December 10, 2010
ఆనందం ఎవరికి దక్కుతుంది?
నా చిన్నప్పటినుండీ నాది ఒకటే ఆలోచన. అది "ఆనందం పొందడం ఎలా?" అని. అందరికీ ఆనందం పొందే అర్హత ఉంది. కానీ అది కొందరికి మాత్రమే దక్కుతోంది. మరి మిగతా వారు పొందడం ఎలా? ఆ ఆనందాన్ని పొందే కొందరు ఎలాంటి జీవనాన్ని ఎంచుకున్నారు? ఆనందం కావాలంటే అన్నీ వదిలి వేసి అడవులకు వెళ్లాలా? నలుగురితో కలిసి జీవించని జీవితం ఎందుకు? నాకు నలుగురితో ఉంటూనే ఆనందంగా జీవించే విధానం కావాలి. అలాంటి రహస్యాలు మీకేమైనా తెలుసా? తెలిస్తే నాకూ తెలపండి.
Tuesday, October 12, 2010
నమస్తే
హమ్మయ్య బ్లొగయితే క్రియేట్ చేశాను. ఎప్పటినుండో తెలుగు బ్లాగులు చూస్తున్న నాకు బ్లొగ్ క్రియేట్ చెయ్యాలన్నది ఒక కల. అది ఈ రోజు ఇలా తీరిన్ది. ఇక ఏమిరాయాలన్నదే ప్రశ్న. ముందయితే నాకు బోలెడన్ని సందేహాలు అవి అడుగుతాను. సందేహపు పక్షి అన్నా ఫర్వాలేదు. నాకు చిన్నప్పటి నుండీ వచ్చే సందేహాలన్నీ ఒక్కటొక్కటీ అడుగుతూ వస్తాను. మధ్యమధ్యలో నాకు తోచిన కబుర్లు చెప్పేస్తాను.
Subscribe to:
Posts (Atom)